నెగిటివ్ వస్తేనే జిల్లాలోకి అనుమతి..! - Corona virus latest news in srikakulam district
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం పురుషోత్తపురం వద్ద ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పరీక్ష గదిని ఏర్పాటు చేసి... రెండు మూడు గంటల్లోనే పూర్తిచేసే విధంగా సర్వం సిద్ధం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం పురుషోత్తపురం వద్ద ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వారికి అధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా లక్షణాలు లేనివారినే జిల్లాలోకి అనుమతించనున్నారు. ఇటీవల కలెక్టర్ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పురుషోత్తపురం సరిహద్దు ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. అందుకు ప్రత్యేక గదిని సిద్ధం చేస్తున్నారు. రెండు మూడు గంటల్లోనే పరీక్షలు పూర్తి చేసి కరోనా లక్షణాలు లేని వారిని పంపిస్తారు. పరీక్షల సమయంలో ఇతర ప్రాంతాల ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు షామియానా సిద్ధం చేస్తున్నారు.