శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా కొవిడ్-19 పరీక్షల కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొన్ని రోజులుగా నమూనాల సేకరించి పరీక్షలు స్థానికంగా నిర్వహిస్తున్నారు. పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో పలువురు వైద్య సిబ్బందికి వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం పంపించారు. ఇదే ప్రాంతంలో జిల్లాలోనే మొదటి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలువురు వైద్య సిబ్బందికి పరీక్షలు నిర్వహించేందుకు తరలించారు. దీంతో ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు వైద్యులు అరకొరగా ఉన్నారు.
వైద్యులకు పరీక్షలు.. రోగులకు పరీక్ష కాలం - srikakulam patapatna latest news update
శ్రీకాకుళంలోని పాతపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం జిల్లాలో కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాతపట్నం సామాజిక ఆసుపత్రి సిబ్బందిని వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం తరలించారు. వైద్యులు పరీక్షల నిమిత్తం వెళ్లడం వల్ల ఆసుపత్రిలో వైద్యం చేసేందుకు అరకొర సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు.
![వైద్యులకు పరీక్షలు.. రోగులకు పరీక్ష కాలం corona testing to doctores at srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7010340-506-7010340-1588302322154.jpg)
పరీక్షల కోసం వైద్య సిబ్బంది తరలింపు