శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మునగలవలస గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. బాధితుడిని జేమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అదే విధంగా ఆమదాలవలస పురపాలక సంఘం వెంగళరావు కాలనీ, తిమ్మాపురం గ్రామంలో ఒకరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుల్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించామని మన్సిపల్ కమిషనర్ రవి సుధాకర్ తెలిపారు.
ఆమదాలవలస మండలంలో కరోనా పాజిటివ్ కలకలం - amadalavalasa mandal latest corona news
ఆమదాలవలస మండలంలో కొవిడ్-19 కేసులు విజృంభిస్తున్నాయి. మునగలవలస గ్రామంలోని ఓ వ్యక్తికి కరోనా వైరస్ నిర్ధారణ అవ్వగా... ఆమదాలవలసలోని వెంగళరావు కాలనీ, తిమ్మాపురం గ్రామంలో ఒకరికి వైరస్ సోకినట్లు అధికారుల తెలిపారు. ఈ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
ఆమదాలవలస మండలంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు