ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో పెరుగుతున్న కంటైన్మెంట్​ జోన్లు... అప్రమత్తమైన అధికారులు

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆమదాలవలసలో ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించగా... నరసన్నపేట మండలంలో తాజాగా ఓ నేత వైద్యునికి కొవిడ్​ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. అధికారులు అప్రమత్తమై కంటైన్మెంట్​ జోన్ల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

corona cases in creasing slowly in srikakulam district
మడపాం గ్రామంలో ఓ నేత్ర వైద్యుడికి కరోనా

By

Published : Jun 20, 2020, 6:08 PM IST

ఆమదాలవలస మండల గ్రామాల ప్రజలకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఎంపీడీవో వెంకటరాజు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వలస కార్మికులు, ప్రయాణికులకు మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మండలంలోని చీమలవలస, దూసే ఎస్సీ కాలనీ, అక్కులపేట గ్రామాల్లో ముగ్గురికి కొవిడ్​ లక్షణాలు కనిపించాయని తెలియజేశారు. అయితే వీరు ముంబై, గుంటూరు, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడం వల్ల లక్షణాలు కనిపించాయని తెలిపారు. శనివారం ఆ గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించే బయటకు రావాలని కోరారు.

నరసన్నపేటలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మడపాం గ్రామంలో ఓ నేత్ర వైద్యుడికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. ఇప్పటికే నరసన్నపేటలో నాలుగు కేసులు నమోదు కాగా తాజాగా మడపాం గ్రామంలో వెలుగు చూసిన కేసుతో ఐదుకు చేరింది. కంటైన్మెంట్ జోన్​లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నేత్ర వైద్యుడు నుంచి ఇంకా ఎంతమందికి వైరస్ సోకిందోననే సమాచారాన్ని సేకరిస్తున్నారు. నరసన్నపేట తహసీల్దార్ ప్రవల్లిక ప్రియ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details