శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కమిషనర్ రామలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులో మెప్మా ఆశా వర్కర్లు మున్సిపల్ సిబ్బందితో కలిసి కరోనాపై అవగాహన కల్పించారు. కొవిడ్‌పై ఇంటింటికి వెళ్లి వాస్తవాలు బోధపరిచారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కమిషనర్ సూచించారు.
ఇచ్ఛాపురంలో కరోనాపై అవగాహన ర్యాలీ - corona awareness rally in srikakulam
కరోనాపై అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరోనా దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ అవగాహన కల్పించారు.
కరోనాపై అవగాహన ర్యాలీ