ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనుగోలుకు నోచుకోని మొక్కజొన్న.. ఇబ్బందుల్లో రైతులు - శ్రీకాకుళంలో మొక్కజొన్న పంట వార్తలు

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా.. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట రైతుల వద్దే ఉండిపోయింది. నిర్దేశించిన లక్ష్యం మేరకే కొన్నామని అధికారులు చెప్తుండగా.. తమ వద్ద కూడా పంట కొనాలని రైతులు వేడుకుంటున్నారు.

corn farmers problems in srikakulam district
కొనుగోలుకు నోచుకోని మొక్కజొన్న

By

Published : May 19, 2020, 7:05 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట కొనుగోలుకు నోచుకోవడం లేదు. సరాలి, చంగుడి, బోరుభద్ర, కొరసవాడ తదితర గ్రామాల్లో ఈ ఏడాది అధికంగా మొక్కజొన్న సాగు చేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని చెప్పినా తమ వద్ద పంట కొనలేదని రైతులు అంటున్నారు.

దీనిపై అధికారుల్ని ప్రశ్నించగా.. తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు చేశామని.. అంతకంటే ఎక్కువ కొనలేమని చెప్పారు. ఇంకా చాలా పంట రైతుల దగ్గరే ఉండిపోయింది. దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారని.. ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇవీ చదవండి.. అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details