శ్రీకాకుళం జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా మొక్కజొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో మొక్కజొన్న పంట 12వేల 396 హెక్టార్లలో సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి కంకులను కత్తెర పురుగులు తింటున్నాయి. జిల్లాలో అత్యధికంగా లావేరు, రణస్థలం, జి.సిగడం, పొందూరు, రాజాం, రేగిడి ఆమదాలవలస, వంగర, సంతకవిటి మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. పురుగు కాటుతో దిగుబడులు తగ్గిపోతాయని వాపోతున్నారు. జిల్లాలో సుమారు 8 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
నివేదిక పంపించాం..
జిల్లాలో ఇప్పటికే నష్టపోయిన మొక్కజొన్న పంటను గుర్తించాం. పంట నష్ట తీవ్రతపై నివేదికలను ప్రభుత్వానికి పంపించాం. కత్తెర పురుగును మొక్క దశలోనే నివారించాలి. కంకులు దశలో నివారణ కష్టం. - కె.చంద్రరరావు, ఏ.డీ.ఏ, రణస్థలం డివిజన్.