శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో అధికారులు ఏర్పాటు చేసిన చేపల విక్రయ కేంద్రంలో వినియోగదారులు కనీస దూరం పాటించడం లేదు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతున్నా కొనుగోలుదారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా చేపల మార్కెట్ రద్దీగా మారింది. ఈ ఘటనపై అధికారులను కలిసినప్పటికీ ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంపులుగా జనం... మారాలి మనం - lockdown in ap
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆమదాలవలస చేపల విక్రయ కేంద్రంలో వినియోగదారులు సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా ఎగబడ్డారు. తద్వారా వైరస్ వ్యాప్తి ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆమదాలవలస చేపల మార్కెట్లో వినియోగదారుల రద్దీ