ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కూల్చివేతలు తప్ప... వైకాపా ప్రభుత్వం సాధించిందేమీ లేదు' - శ్రీకాకుళంలో తెదేపా నియోజకవర్గ సమావేశాలు

శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గ  స్థాయి సమావేశాన్ని తెదేపా మాజీ ఎంపీలు, సర్పంచులు నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వైకాపా పాలనపై మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నియేజకవర్గ సమావేశం

By

Published : Nov 11, 2019, 5:07 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న కళా వెంకట్రావు
వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూల్చివేతలు తప్ప సాధించిందేమీ లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో కార్మికులకు రోజుకి రూ. 200 కోట్లు నష్టం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు.

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details