శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా చేపడుతున్న రెండు కోట్ల సంతకాల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి మండిపడ్డారు. ఈ సంతకాలను రైతులకు మద్దతుగా సేకరిస్తున్నామని తెలిపారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొడ్డేపల్లి గోవింద్ గోపాల్, సనప అన్నాజీ రావు తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.