కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ... ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ లోక్ సభస్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు రాసిన లేఖలో ఆమె పేర్కోన్నారు. సోనియాగాంధీ- తెదేపా అధినేత చంద్రబాబులు రాజకీయంగా పొత్తు పెట్టుకోవటం వ్యభిచారమంటూ తమ్మినేని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని... ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో పాటు అనుచితమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో మహిళలకు ఉన్న గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. తమ్మినేనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సుంకర పద్మశ్రీ ఆ లేఖలో లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.
తమ్మినేనిపై లోక్‌సభ స్పీకర్‌కు సుంకర పద్మశ్రీ ఫిర్యాదు - తమ్మినేని సీతారాం లేటెస్ట్ న్యూస్
ఏపీ సభాపతి తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలంటూ... లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ లేఖ రాశారు. సోనియా గాంధీపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో మహిళలకు ఉన్న గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు.
తమ్మినేనిపై సుంకర పద్మశ్రీ ఫిర్యాదు