కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తులో చెయ్యిపెడితే ఊరుకునేదిలేదని... ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ హెచ్చరించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన విద్యుత్ విధానాలపై పార్టీ ఆధ్వర్యంలో... శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలిలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సిక్కోలు రైతాంగం పక్షాన నిలబడతుందని శైలజానాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీలో పోరాడుతున్న అన్నదాతలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఏడు రోడ్ల కూడలిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన - AP congress Latest news
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలిలో నిరసన చేపట్టారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఏడు రోడ్ల కూడలిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన