శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో ఉద్రిక్తత నెలకొంది. మెట్టవలసలో.. వైకాపా, తెదేపా వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. నాలుగో విడత పంచాయతీ పోరులో గెలిచిన తెదేపా అభ్యర్థిపై.. వైకాపా వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర సందేశాలు పంపారని.. తెదేపావర్గీయులు ఆరోపించారు. ఈ విషయంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పర దాడి చేసుకోగా.. సుమారు 20 మందికి గాయాలయ్యాయి. వారందరికి రాజాం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాళ్లదాడిలో రామాలయం సహా.. కొందరి ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మెట్టవలసలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ.. 20మందికి గాయాలు - శ్రీకాకుళం జిల్లా మెట్టవలస వార్తలు
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో.. ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంపై తెదేపా వర్గీయులు వైకాపా వారిని నిలదీయగా దాడి జరిగింది. ఘటనలో 20మంది గాయపడగా.. వారిని రాజాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మెట్టవలసలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ.. 20మందికి గాయాలు