శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కుంటిభద్ర కాలనీలో పుట్ట గొడుగులు కోసం రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ ఒకరి మృతికి దారితీసింది. కొట్లాటలో తీవ్రంగా గాయపడిన వైకాపా కార్యకర్త కామక జంగం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గాయపడిన మరో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. తమ కార్యకర్త హత్యను తీవ్రంగా పరిగణించాలని వైకాపా నేత విజయసాయిరెడ్డి... డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జంగం హత్యను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఖండించారు.
పుట్ట గొడుగుల కోసం ఇరువర్గాల ఘర్షణ...ఒకరు మృతి - conflict between the two groups in srikakulam district
పుట్ట గొడుగుల కోసం రెండు వర్గాల మధ్య మొదలైన గొడవలో ఒకరు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. కొత్తూరు మండలం కుంటిభద్ర కాలనీలో జరిగిన కొట్లాటలో వైకాపా కార్యకర్త కామక జంగం అనే వృద్ధుడు పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
conflict-between-the-two-groups-killed-one-person-in-srikakulam-district
TAGGED:
పుట్టగొడుగుల కోసం పంచాయితీ