ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం, ఇచ్ఛాపురంలో పూర్తి స్థాయి లాక్​డౌన్ - corona news srikakulam district

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో శ్రీకాకుళం, ఇచ్ఛాపురంలో పూర్తి స్థాయి లాక్​డౌన్ అమలులోకి వచ్చింది. జిల్లాలో సెక్షన్ 144 అమల్లో ఉందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ బర్దార్ హెచ్చరించారు.

complete lockdown in srikakulam, ichchapuram
మాట్లాడుతున్న ఎస్పీ

By

Published : Jul 20, 2020, 8:54 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున శ్రీకాకుళం, ఇచ్ఛాపురంలో పూర్తి స్థాయి లాక్​డౌన్ అమలులోకి వచ్చింది. జిల్లాలోని గార, ఆమదాలవలస, బూర్జ, వీరఘట్టం, రాజాం, రణస్థలం, సీతంపేట, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, నరసన్నపేట, పోలాకి, సారవకోట, టెక్కలి, కోటబొమ్మాళి, పలాస, వజ్రపుకొత్తూరు, కంచిలి, సోంపేట, కవిటిలో అంక్షలతో కూడిన లాక్​డౌన్ అమలులో ఉంది.

ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకే దుకాణాలకు అనుమతినిచ్చామని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుడదన్న ఎస్పీ...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details