వలస కార్మికులకు కొవిడ్ పరీక్షలు పూర్తి - corona latest news at narsannapeta
నరసన్నపేటలో నాలుగు పునరావాస కేంద్రాల్లోని 414 మంది వలస కార్మికులకు కొవిడ్ పరీక్షలు పూర్తయ్యాయి. వారిని త్వరలోనే స్వగ్రామాలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.
![వలస కార్మికులకు కొవిడ్ పరీక్షలు పూర్తి Complete Covid tests for migrant workers at narsannapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7186980-1068-7186980-1589389870291.jpg)
వలస కార్మకులకు కొవిడ్ పరీక్షలు పూర్తి
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 414 మంది వలస కార్మికులకు కొవిడ్ పరీక్షలు పూర్తయ్యాయి. గుజరాత్ నుంచి వచ్చిన వలస కార్మికులకు 14 రోజులపాటు పునరావాసం పూర్తయిన తరుణంలో వారందరికీ విడతలవారీగా ట్రూనాట్ పరీక్షలు చేశారు. పరీక్షలో వలస కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరందరిని త్వరలోనే స్వగ్రామాలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.