శ్రీకాకుళం జిల్లాలో అత్యవసర శస్త్రచికిత్సలకు బ్లడ్‌బ్యాంకుల్లో అవసరమైనంత రక్తనిల్వలు ఉండేలా కలెక్టర్ నివాస్ చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ప్రభుత్వోద్యోగులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తే... రక్త కొరత రాకుండా జాగ్రత్తపడొచ్చని పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరూ రెడ్‌క్రాస్ రక్తసేకరణ కేంద్రానికి వచ్చి రక్తదానం చేయొచ్చన్నారు. అందులో భాగంగా తొలుత ఆయనే రక్తదానం చేశారు
"రక్తదానం చేయటానికి స్వచ్చందంగా ముందుకు రావాలి" - శ్రీకాకుళం జిల్లాలో రక్తదానం చేసిన కలెక్టర్
శ్రీకాకుళం జిల్లాలో అత్యవసర శస్త్ర చికిత్సలకు రక్తకొరత రాకుండా ఉండేందుకు జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ స్వచ్చందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్