శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కలెక్టర్ నివాస్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటికే నలుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న మరో 50 మందికి మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో రాఫిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ మండల కేంద్రంలో పర్యటించి కరోనాకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కంటెన్మెంట్ జోన్ల్లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
'ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలి' - srikakulam district collectore nivas latest comments
ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించేలా చూడాలని అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ఆదేశించారు. కరోనా కారణంగా ఇప్పటికే జె.ఆర్.పురం గ్రామ ప్రజలు, వ్యాపారులు రెండు రోజులుగా స్వచ్ఛంద బంద్ నిర్వహిస్తున్నారు. రణస్థలంలో జిల్లా కలెక్టర్ పర్యటనలో కరోనా వైరస్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
!['ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలి' collectore-nivas-visited-ranastalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7916957-717-7916957-1594046930053.jpg)
రణస్థలంలో కలెక్టర్ నివాస్ పర్యటన
TAGGED:
కరోనా కేసులు తాజా వార్తలు