శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కొంత భాగాన్ని కోవిడ్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో కోవిడ్ వైద్య సదుపాయాలు పెంపొందించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జీజీహెచ్లో కొన్ని బ్లాకులను కరోనా చికిత్సకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు.
ఈ మేరకు కలెక్టర్ నివాస్, జేసీ సుమిత్ కుమార్, జీజీహెచ్ వైద్యులు ఆసుపత్రిని పరిశీలించారు. కోవిడ్, కోవిడేతర వ్యాధిగ్రస్తులు వచ్చే మార్గాలు, బయటకు వెళ్ళే మార్గాలు, ఐసీయూ వార్డులు, ఐసోలేషన్ వార్డులు, వైద్యుల క్వారంటైన్ సౌకర్యాలు తదితర విభాగాల్లో మార్పులపై సూచనలు చేశారు.