శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోందని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లో కరోనా నిరోధక టన్నెల్‌ను రహదారిలో ఆయన ప్రారంభించారు. జిల్లాల్లోనే కరోనా నమూనాల పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో టీబీ నమూనాల పరీక్షల కేంద్రాలను కరోనా నమూనాల పరీక్షల కేంద్రంగా మార్చుతున్నామన్నారు. పరీక్షలకు అవసరమయ్యే శిక్షణకు సిబ్బందిని కాకినాడ పంపించామని చెప్పారు.
కరోనా నిరోధక టన్నెల్ ప్రారంభించిన కలెక్టర్ - lockdown in Srikakulam
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోందని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్‌లో కరోనా నిరోధక టన్నెల్‌ను కలెక్టర్ ప్రారంభించారు.
శ్రీకాకుళంలో కరోనా నిరోధక టన్నెల్‌ను ప్రారంభించిన కలెక్టర్