శ్రీకాకుళం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్‌బర్దార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించారు. ఇప్పటికే మండల స్థాయిలో ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తయిందన్నారు.
'సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి' - ఈరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్పీ సమావేశం తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఆగమేఘాలపై సిద్ధమవుతున్నారు. దాదాపు అందరికీ గుర్తుల కేటాయింపు సైతం జరిగిపోయింది. దీంతో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్‌బర్దార్ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్, ఎస్పీ సమీక్ష
ఈ నెల 5న పోలింగ్ సిబ్బందికి, 6న కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేయనున్నారు. పోలింగ్, కౌంటింగ్ రోజున అన్నిచోట్ల పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఎస్పీ అమిత్ బర్దార్ జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఇవీ చూడండి...