ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్​ - collector nivas latest news update

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్ నివాస్ మున్సిపల్, రెవిన్యూ, వైద్య అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్​లో ఉన్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ పరీక్ష నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

collector review meeting on corona
కరోనాపై కలెక్టర్​ నివాస్​ సమీక్ష

By

Published : Jul 17, 2020, 10:50 PM IST

గ్రామాల్లో జ్వరాలు ఉన్నవారికి సర్వే చేపట్టి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్ నివాస్ మున్సిపల్, రెవిన్యూ, వైద్య అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డాక్టర్ బి.పద్మ, మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, తహసీల్దార్ గురుగుబెల్లి శ్రీనివాసరావుతో పాటు మున్సిపల్ రెవెన్యూ, వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details