ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ కేర్ ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం' - కొవిడ్ కేర్ ఆసుపత్రులు వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ కేర్ ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని... జిల్లా పాలనాధికారి జే.నివాస్ తెలిపారు. టెక్కలి అంబేడ్కర్ భవనంలో వైద్యాధికారులు, సర్వేలెన్సు బృందాలతో కలెక్టర్, జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

collector review meeting on covid care centres in srikakulam district
కొవిడ్ కేర్ ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం

By

Published : Jul 24, 2020, 1:31 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ కేర్ ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని కలెక్టర్ జే.నివాస్ తెలిపారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. వచ్చే బుధవారం నాటికి పనులు పూర్తిచేసి కోవిడ్ కేర్ సెంటర్​ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పర్యటించి పక్కాగా సర్వే నిర్వహించినప్పుడే కరోనా తీవ్రతను అరికట్టగలమని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. టెక్కలి అంబేడ్కర్ భవనంలో వైద్యాధికారులు, సర్వేలెన్సు బృందాలతో కలెక్టర్, జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో... కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details