శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేటలో బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చిన ఘటనపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారమైన కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆర్డీవో కిషోర్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఘటనపై విచారణ చేసి వాస్తవాలు వెలికితీయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఓట్ల లెక్కింపు తర్వాత బ్యాలెట్ పత్రాలు గల్లంతైనట్లు ఆయన తెలిపారు. దొరికిన బ్యాలెట్ పత్రాలతో మెుత్తం సంఖ్య సరిపోయిందని.. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.