ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యమైతే చర్యలు తప్పవు: కలెక్టర్ - food poison

Collector visits IIIT Srikakulam: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఉన్న ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని సుమారు 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా కలెక్టర్ కేశ్ బి.లాత్కర్ స్పందించారు. ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

iiit srikakulam
iiit srikakulam

By

Published : Nov 5, 2022, 10:25 PM IST

iiit srikakulam

Collector visits IIIT Srikakulam: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లో ఉన్న ట్రిపుల్​ ఐటీలో కలుషిత ఆహారం తిని సుమారు 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కేశ్ బి.లాత్కర్ సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనకు విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యమే కారణమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారిని మీనాక్షి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆర్డీవో బి శాంతి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తిన్నా ఆహారాన్ని పరిశీలించారు.

ఈ విశ్వవిద్యాలయంలో ఇది మామూలే
శుక్రవారం ఉదయం నుంచి విద్యార్థుల తీవ్ర అస్వస్థత గురైనప్పటికీ విశ్వవిద్యాలయం అధికారులు కనీసం బయటికి రానివ్వలేదు. విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయం అధికారులు నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. విశ్వవిద్యాలయంలో పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం నాయకులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details