శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లను ఎస్పీ అమిత్ బర్దార్‌తో కలెక్టర్ నివాస్ పరిశీలించారు. ఈ నెల 18న అర్ధరాత్రి ప్రారంభమై 19వ తేదీన అర్ధరాత్రి వరకు వేడుక కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. వేడుకల్లో భాగంగా సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
రథసప్తమి వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ నివాస్ ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేందుకు జనరేటర్లు సిద్ధం చేయాలని సూచించారు. ఆలయం లోపల, క్యూలైన్లలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల అవసరం మేరకు వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేయాలని అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి చెప్పారు.