చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించడానికి 'జగనన్న తోడు' పథకం రూపకల్పన చేశామని ముఖ్యమంత్రి అన్నారు. సీఎం ప్రారంభించిన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
'జగనన్న తోడు' పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ - jaganna thodu scheme in srikakulam news
చిరు వ్యాపారులను ఆదుకోవటమే 'జగనన్న తోడు' పథకం ముఖ్య ఉద్దేశమని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
జగనన్న తోడు కార్యక్రమంలో చెక్కుల పంపిణీ
జిల్లాలో 42,238 మంది లబ్ధిదారులకు.. 42 కోట్ల 24 లక్షలు 'జగనన్న తోడు' పథకం కింద మంజూరు చేశారని కలెక్టర్ నివాస్ తెలిపారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. అనంతరం చెక్కుల పంపిణీ చేశారు. బ్యాంకు అధికారులకు సన్మానం చేశారు.
ఇదీ చదవండి:'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు