కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు వేగవంతం చేస్తున్నట్టు శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ తెలిపారు. శనివారం నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలోని కరోనా వైరస్ పరీక్షలక నిర్వహణ నిమిత్తం.. నమూనాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నరసన్నపేట, పోలాకి మండలాల నుంచి.. మూడవ దశ సర్వే ద్వారా గుర్తించిన అనుమానితులకు.. పరీక్ష చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఆయన నరసన్నపేట మేజర్ పంచాయతీ కార్యాలయంలోని అధికారులతో సమీక్షించారు. తామరాపల్లి సమీపంలోని క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించి.. పలువురికి వస్త్రాలు పంపిణీ చేశారు.
శ్రీకాకుళంలో కరోనా అనుమానితుల నమూనాల సేకరణ - శ్రీకాకుళంలో కరోనా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి పరీక్షలు వేగవతం చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. పరీక్షలకు నమూనాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి ప్రారంభించారు.
Collection of specimens of corona suspects in Srikakulam