శ్రీకాకుళం వాంబే కాలనీ సమీపంలో రెండు పాములు జనాలను పరుగులు పెట్టించాయి. నివాస గృహాల వద్ద ఉన్న ఈ రెండు పాముల్ని గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం నేర్పుగా పట్టుకుంది. వీటిలో ఆరు అడుగుల కొండచిలువ, ఐదు అడుగుల రేట్ స్నేక్ ఉన్నాయి. గ్రీన్ మెర్సీ సీఈఓ రమణమూర్తి చాకచక్యంగా ఈ రెండు పాముల్ని బంధించి.. జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయానికి తరలించారు. డీఎఫ్ఓ సందీప్ కృపాకర్ సూచన మేరకు ఈ రెండు పాముల్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
శ్రీకాకుళంలో కొండ చిలువ.... భయంతో జనం పరుగులు
పాము పేరు వింటేనే కొందరు భయపడతారు. అలాంటిది వంపులు తిరుగే కొండ చిలువను చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది. అలాంటి ప్రాణులను ఎంతో చాకచక్యంగా పట్టుకున్న వీడియోలో మీరూ చూసేయండి.
cobra and snakes are moving at Wambay Colony in Srikakulam district