ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థులందరికీ 100 శాతం ఫీజు రియంబర్స్​మెంట్ : సీఎం జగన్ - undefined

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో నూతనంగా నిర్మించిన భవనాలను సీఎం జగన్ ప్రారంభించారు. కాసేపు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ట్రిపుల్ ఐటీలలో వృతినైపుణ్య కేంద్రాలను ఏర్పాటుచేయాలన్న సీఎం...విద్యార్థులకు 100 శాతం రియంబర్స్​మెంట్ కల్పిస్తామని హామీఇచ్చారు.

విద్యార్థులకు 100 శాతం ఫీజు రియంబర్స్​మెంట్ : సీఎం జగన్

By

Published : Sep 6, 2019, 9:03 PM IST

విద్యార్థులకు 100 శాతం ఫీజు రియంబర్స్​మెంట్ : సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తోన్న సీఎం జగన్... ఎచ్చెర్ల మండలంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక-సాంకేతిక విశ్వవిద్యాలయం(ట్రిపుల్ ఐటీ)లో రూ. 28 కోట్లతో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో సీఎం మాట్లాడారు. ప్రతి ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉద్యోగనైపుణ్యాలలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్​మెంట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా భోజన, వసతి సౌకర్యం కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున అందిస్తామన్నారు. చదువుకునే ప్రతీవిద్యార్థికి ఏటా రూ. 15000 అందిస్తామని హామీఇచ్చారు.

ఇదీ చదవండి :

For All Latest Updates

TAGGED:

jagan

ABOUT THE AUTHOR

...view details