ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 2, 2021, 10:06 AM IST

ETV Bharat / state

cm review on rains: తుపాను పరిస్థితులపై సీఎం సమీక్ష.. ఆ జిల్లాలకు పర్యవేక్షణ అధికారులు

cm review on rains: ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు అధికారులను సీఎం ఆదేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

cm jagan
cm jagan

cm jagan review: ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికల దృష్ట్యా ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైనచోట సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

special officers: ఉత్తరాంధ్రలో తుపాన్‌ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు సీఎం జగన్​ అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌. అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాను సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు స్వీకరించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

ఇదీ చదవండి:

ap high court fires on police: నిందితుల్ని అక్రమ నిర్బంధంలో ఎందుకు ఉంచుకుంటున్నారు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details