CM Jagan Help A Sick Girl: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో ఓ బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. రేగిడి మండలం చిన్న సిర్లం గ్రామానికి చెందిన మీసాల ఇంద్రజ అనే ఏడేళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. పుట్టిన నాటి నుంచే ఆమె తలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమె ఆరోగ్యం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. ఇప్పటికే రూ.4 లక్షల వరకు ఖర్చు చేసి.. శస్త్ర చికిత్స చేయించారు. మరోవైపు బాలిక తండ్రి అప్పలనాయుడు కిడ్నీ వ్యాధిగ్రస్తుడు. దీంతో ఇంద్రజ తల్లి కృష్ణవేణి.. సామాజిక కార్యకర్త సిద్ధార్థ సహాయంతో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి.. నరసన్నపేటకు వచ్చారు.
అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి ఆర్థిక సహాయం.. - ఇంద్రజకు సీఎం సాయం చేశారు
CM Jagan Help A Sick Girl: పుట్టినప్పటి నుంచే ఆ బాలిక తలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. పాప తల్లిదండ్రులు ఇప్పటివరకు రూ.4లక్షల వరకు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించారు. మరోవైపు బాలిక తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం నరసన్నపేటకు వస్తున్నాడని తెలుసుకుని.. ఆ కుటుంబం అక్కడకు చేరుకుంది. స్పందించిన సీఎం ... వెంటనే పాపకు సాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
CM helps a sick girl
నరసన్నపేటలో సీఎంజగన్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నిరాశగా ఉన్న సమయంలో.. ఆ వైపుగా వెళుతున్న కాన్వాయ్ నుంచి ముఖ్యమంత్రి జగన్ గుర్తించి.. వాహనం దిగి ఇంద్రజ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వెంటనే కలెక్టర్ శ్రీకేష్ లట్కర్ని పిలిచి ..వైద్య సహాయం అందించాలని, ఆమెకు పది వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 24, 2022, 11:18 AM IST