ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీకు మంచి జరిగితే.. నాకు అండగా నిలబడండి: సీఎం జగన్​ - శ్రీకాకుళంలో సీఎం పర్యటన

CM JAGAN FIRES ON CHANDRABABU AND PAWAN : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్​పై ముఖ్యమంత్రి జగన్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరూ కలిసి అధికారం కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. తాను నమ్ముకున్నది ప్రజలు, దేవుడి దయనే అన్న జగన్​.. ప్రతి ఇంటికీ మంచి జరిగిందా? లేదా? అనే అంశాన్ని కొలమానంగా తీసుకోవాలని సూచించారు.

cm jagan fire on babu pawan
cm jagan fire on babu pawan

By

Published : Nov 23, 2022, 4:55 PM IST

CM JAGAN FIRES ON CBN AND PAWAN :శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సభలో సీఎం జగన్‌.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. తెలుగుదేశం, జనసేనలపై మండిపడ్డ ఆయన.. తమ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో చేస్తున్న మంచిని చెప్పడం లేదన్నారు. ఇద్దరూ కలిసి అధికారం కోసం ఆరాటపడుతున్నారన్న జగన్‌.. వారు చెప్పే మాటలు నమ్మవద్దని సూచించారు. ప్రతి ఇంటికీ తాను అందిస్తున్న సంక్షేమ ఫలాలను గమనించాలని ప్రజలను కోరారు. మంచి జరిగితే అండగా నిలబడాలని కోరారు. తాను నమ్ముకున్నది ప్రజలు, దేవుడి దయనే అన్న జగన్​.. ప్రతి ఇంటికీ మంచి జరిగిందా? లేదా? అనే అంశాన్ని కొలమానంగా పెట్టుకోవాలని సూచించారు.

మీ ఇంట్లో మంచి జరిగితే నాకు అండగా నిలబడండి

ABOUT THE AUTHOR

...view details