ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ...8 మందికి గాయాలు ! - శ్రీకాకుళం వైకాపాలో భగ్గుమన్న వర్గవిభేదాలు

కుళాయి ఏర్పాటులో తలెత్తిన వివాదం వైకాపా కార్యకర్తల మధ్య కొట్లాటలకు దారితీశాయి. ఘటనలో 8 మంది గాయపడగా...వారిని ఆసుపత్రికి తరలించారు.

వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ
వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

By

Published : Apr 10, 2020, 1:31 AM IST

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సోమరాజుపేటలో వైకాపా కార్యకర్తల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామంలో తాగునీటి కుళాయి ఏర్పాటు విషయంలో జరిగిన గొడవ.. కొట్లాకు దారితీసింది. ఈ ఘర్షణలో 8 మంది గాయపడ్డారు. స్థానికులు వారిని రాజాం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details