శ్రీకాకుళం జిల్లా పొందూరులో సభాపతి తమ్మినేని సీతారాం సమక్షంలోనే వైకాపా నేతల్లో వర్గ విభేదాలు తలెత్తాయి. సభాపతి సొంత నియోజకవర్గం ఆమదాలవలసలోనే వివాదాలు బహిర్గతమయ్యాయి. పొందూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో... వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సభాపతి తమ్మినేని ఎదుటే.. వైకాపా నేతలు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు.
వైకాపాలో వర్గ విభేదాలు.. సభాపతి తమ్మినేని సమక్షంలో నేతల ఘర్షణ - తమ్మినేని సొంత నియోజకవర్గంలో వర్గ భేదాలు న్యూస్
Class differences between ysrcp leaders in srikakulam
16:11 June 25
పరిస్థితి కాస్త అదుపు తప్పి.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇళ్ల స్థలాల జాబితా తయారీ విషయంలో.. కార్యకర్తలు ఇలా సభాపతి సాక్షిగా బాహాబాహీకి దిగారు. చివరికి పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి:
ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని అడ్డుకున్న ప్రజలు.. గోబ్యాక్ అంటూ నినాదాలు
Last Updated : Jun 25, 2020, 4:49 PM IST