శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వైకాపాలో అనైక్యత మరోసారి బయటపడింది. సోంపేటలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నేతలు నిరసన గళం వినిపించారు. స్థానిక ఎన్నికల తర్వాత ప్రతిగ్రామంలోనూ రెండు గ్రూప్‌లు తయారయ్యాయని.. వాటిని నిలువరించకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను నేతలు పట్టించుకోవడం లేదని బాహాటంగా తమ వాణి వినిపించారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు నిలదీస్తున్నారని మరికొందరు వాపోయారు.
ఇలాగైతే వైకాపా మళ్లీ గెలవడం అసాధ్యం.. మంత్రుల ముందే గళం విప్పిన కార్యకర్తలు! - ఇచ్ఛాపురం వైకాపాలో అంసృప్తి జ్వాలలు వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వైకాపాలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో- ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఎదుట పార్టీ కార్యకర్తలు నిరసన గళం వినిపించారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు నిలదీస్తున్నారని బాధలు చెప్పుకున్నారు.
![ఇలాగైతే వైకాపా మళ్లీ గెలవడం అసాధ్యం.. మంత్రుల ముందే గళం విప్పిన కార్యకర్తలు! ఇచ్ఛాపురం వైకాపాలో అంసృప్తి జ్వాలలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15481263-909-15481263-1654444386060.jpg)
ఇచ్ఛాపురం వైకాపాలో అంసృప్తి జ్వాలలు
ఇచ్ఛాపురం వైకాపాలో అంసృప్తి జ్వాలలు
వైకాపా నేతల వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకు దొరికింది కదా అని అందరూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ నేతల తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఐక్యత లేకపోవడం వల్లే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా అందరూ భేషజాలు వీడి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.
ఇవీ చూడండి