శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సర్పంచ్ ఎన్నికల్లో.. తెదేపా మద్దతుదారు గెలుపుపై.. వైకాపా కార్యకర్తలు దూషణలకు దిగారు. తొలుత మహిళల మధ్య వివాదం చెలరేగింది. అదికాస్త చిలికి చిలికి గాలివానలా విస్తరించి గ్రామంలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇళ్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
శ్రీకాకుళం: బుడగట్లపాలెంలో యుద్ధ వాతావరణం..! - బుడగట్లపాలెంలో నెలకొన్న యుద్ధ వాతావరణం న్యూస్
శ్రీకాకుళం జిల్లా ఎచెర్ల మండలం బుడగట్లపాలెంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపరిచిన అభ్యర్థి గెలుపుపై వైకాపా కార్యకర్తలు దూషించడంతో.. మహిళల మధ్య వివాదం చెలరేగింది. అదికాస్త గ్రామంలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ కొట్లాటలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా.. ఇళ్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.
బుడగట్లపాలెంలో నెలకొన్న యుద్ధ వాతావరణం
ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అనంతరం బాధితులను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గెలుపు విషయంపై మాటామాటా పెరగడంతో.. ఘర్షణకు దారి తీసిందని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో భయానక వాతావరణం నెలకొందని వెల్లడించారు.
ఇదీ చదవండి:
మెట్టవలసలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ.. 20మందికి గాయాలు
Last Updated : Feb 23, 2021, 5:56 PM IST