శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పందిగుంటలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తాగునీటి బోరు విషయంలో వివాదం తలెత్తగా... కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ముగ్గురిని శ్రీకాకుళం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఘటనతో పందిగుంట గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ - పందిగుంట గ్రామంలో ఘర్షణ వార్తలు
శ్రీకాకుళం జిల్లా పందిగుంట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చిన్న విషయంలో వివాదాలు తలెత్తటంతో వైకాపా, తెదేపా వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనలో 25మంది గాయపడ్డారు.
clash between TDP and YCP FOLLOWERS IN SRIKAKULAM DISTRICT