కృష్ణం వలసలో ఉద్రిక్తత.. పోలీసుల పికెటింగ్ - ycp
కృష్ణం వలసలో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వైకాపా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దాడికి పాల్పడిన వారికోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
![కృష్ణం వలసలో ఉద్రిక్తత.. పోలీసుల పికెటింగ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3707672-112-3707672-1561919094554.jpg)
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కృష్ణం వలసలో వైకాపా, తెదేపా మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు పికెట్ంగ్ నిర్వహించారు. కృష్ణం వలసలో జరిగిన ఘర్షణపైవైకాపా సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో అయిదుగురిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడైన వైస్ ఎంపీపీ కేసరితో పాటు మిగిలిన వారి కోసం కృష్ణవలస, కొండగూడెం, శ్రీహరినాయుడుపేట తదితర గ్రామాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితులు ఎక్కడ ఉన్నా వదిలేది లేదని పాలకొండ డీఎస్పీ ప్రేమ్ కాజల్ తెలిపారు.