ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాణ్యమైన బియ్యం పంపిణీపై ప్రజలు సంతృప్తి : కోన శశిధర్ - నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్

శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పరిశీలించారు. బియ్యం పంపిణీపై జిల్లా ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.

నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్

By

Published : Sep 11, 2019, 2:31 PM IST

నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్

శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..నాణ్యమైన బియ్యం పంపిణీపై జిల్లా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం వంటి వసతులు తక్కువగా ఉన్న జిల్లాలో మొదటి రోజున 92 శాతం పంపిణీ చేశారని ప్రశంసించారు. బియ్యం నాణ్యతపై పలువురు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, తినగలిగే బియ్యం పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అక్టోబరు 2వ తేదీన గ్రామ సచివాలయాలు ఏర్పడతాయని, అప్పటి నుంచి 72 గంటల్లో రేషన్ కార్డు మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలాసలో నాణ్యమైన బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి విధితమే.

ABOUT THE AUTHOR

...view details