సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరంలో కార్మికులు నిరసన చేపట్టారు. ఏపీ ఫ్యాక్టరీలు, సంస్థలు చట్టం 74 లోని సెక్షన్లు 3(2), 5 ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థలు, దుకాణాలు మూసివేసిన కాలానికి.. కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కరోనా సేవల్లో ఉన్న వైద్య సిబ్బందికి, ఆశాలకు, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు ప్రోత్సాహకంగా ఒక నెల వేతనం అదనంగా చెల్లించాలన్నారు నాణ్యమైన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణం, హమాలీ, ఆటో, రవాణా తదితర అన్ని రంగాల అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.10 వేలు ఖాతాల్లో జమ చేయాలన్నారు.