కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందరావు సభాపతి తమ్మినేని సీతారాంకు వినతిపత్రం అందించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. పొందూరులో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి పోల్స్ పరిశ్రమ కార్మికుల ఇబ్బందుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యాక్టరీలో కొంతమందిని తొలగించారని.. వెంటనే వారిని విధుల్లోకి తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ సమయంలో కార్మికుల వేతనాలు చెల్లించాలన్నారు. దీనిపై స్పీకర్ సీతారాం స్పందిస్తూ.. ఇప్పటికే కర్మాగారం యజమానితో మాట్లాడానని.. సమస్యలు పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
'కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చూడండి' - ఆమదాలవలసలో స్పీకర్ను కలిసిన సీఐటీయూ ఉపాధ్యక్షుడు గోవిందరావు వార్తలు
కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. సీఐటీయూ ఉపాధ్యక్షుడు స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తిచేశారు. లాక్ డౌన్ కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.., వారి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
స్పీకర్ తమ్మినేని సీతారాంకు వినతిపత్రం ఇస్తున్న సీఐటీయూ నాయకులు