శ్రీకాకుళం జిల్లాలో ఇసుక ఎడ్లబండ్ల కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లుతో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని డచ్ భవనం వద్ద నిరసన ప్రదర్శన చేశారు . కార్మికుల సమస్య పరిష్కరించకపోతే.. నవంబర్ 5న నాగావళి నదిలో ఇసుక దీక్ష చేపడతామని హెచ్చరించారు. నాగావళి నదీ తీరంలో ఇసుక ఎడ్లబండ్లుపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇసుక కార్మికులకు ఉపాధి కల్పించాలి: సీఐటీయూ - sand labours protest with bullock carts
ఇసుక ఎడ్లబండ్ల కార్మికుల సమస్య పరిష్కరించకపోతే... నాగావళి నదిలో ఇసుక దీక్ష చేపడతామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందరావు హెచ్చరించారు. నాగావళి నదీ తీరంలో ఇసుక ఎడ్లు బండ్లుపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇసుక ఎడ్లబండ్లతో నిరసన