శ్రీకాకుళంలో సీఐటీయూ నేతలు, మహిళలు మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. లాక్ డౌన్ లో 45 రోజుల పాటు మద్యం విక్రయాలు నిషేధించి అర్ధంతరంగా మళ్లీ విక్రయాలు ప్రారంభించటం ప్రభుత్వ అనైతిక తీరుకు నిదర్శమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ సురేష్ బాబు విమర్శించారు.
నరసన్నపేటలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మద్యం విక్రయాలు నిలిపివేసి పేదలకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చలపతిరావు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.