లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని.. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరులో దాదాపు 270 కుటుంబాలకు మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు పాల్గొన్నారు.
'ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి' - లావేరులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
శ్రీకాకుళం జిల్లా లావేరులో కార్మిక కుటుంబాలకు సీఐటీయూ ఆధ్వర్యంలో నిత్యావసరాలు, మాస్కులు అందజేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు కోరారు.
!['ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి' citu distributed masks daily needs to people at laaveru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6728335-721-6728335-1586440721402.jpg)
లావేరులో నిత్యావసరాలు పంపిణీ