రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను తక్షణమే నిలుపుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ప్రజలకు మద్యం అవసరం లేదనీ.. మూడు పూటల తిండి ఉంటే సరిపోతుందనీ అన్నారు.
'మద్యం వద్దు... పేదల ఆకలి తీర్చండి చాలు' - srikakulam district
ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే ప్రభుత్వం మాత్రం తమ ఆదాయం కోసం మద్యం దుకాణాలను విచ్చలవిడిగా తెరుస్తుందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే వైన్ షాపులను మూసి వేసి.. పేదలకు మూడు పూటల కాస్త తిండి పెట్టాలని డిమాండ్ చేశారు.
!['మద్యం వద్దు... పేదల ఆకలి తీర్చండి చాలు' srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7083609-626-7083609-1588764197451.jpg)
మద్యం వద్దు... పేదలకు మూడు పూటల తిండి పెట్టండి