ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జిల్లాలో 100 పడకల ఈఎస్​ఐ ఆసుపత్రి నిర్మించాలి'

కార్మికులకు వైద్యం అందించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని.. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 100 పడకల ఈఎస్​ఐ ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

citu dharna in srikakulam for est hospital
సీఐటీయూ ధర్నా

By

Published : Sep 28, 2020, 6:50 PM IST

శ్రీకాకుళం జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని.. లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందరావు హెచ్చరించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గోవిందరావు మాట్లాడుతూ.. ఈఎస్ఐ డిస్పెన్సరీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. మందుల కొరత తీర్చి కార్మికులకు పూర్తిస్థాయిలో మందులు సరఫరా చేయాలన్నారు.

ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో ప్రారంభించి, మూసివేసిన డిస్పెన్సరీలకు డాక్టర్లు, సిబ్బందిని నియమించి.. కార్మికులకు ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఈఎస్ఐ బీమాగా కోట్లాది రూపాయలు తమ వేతనాల నుంచి చెల్లిస్తున్నా మెరుగైన వైద్యం అందడం లేదని విమర్శించారు. సాధారణ జ్వరం, దగ్గు, తలనొప్పి వంటి అనారోగ్యాలకు కూడా మందులు లేవని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details