ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తరగతుల వారీగా ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి' - Members of the State Child Rights Commission, Kesali Kapali

ప్రైవేటు రంగంలో నడుస్తున్న విద్యాసంస్థలు తరగతుల వారీగా ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని.. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు స్పష్టం చేశారు.

srikakulam district
విద్యాసంస్థలు తరగతుల వారీగా ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి

By

Published : Jun 6, 2020, 4:37 PM IST

శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు కేసలి అప్పారావు, జిల్లాకు చెందిన బాలల హక్కుల కమిషన్ సభ్యులు పీవీవీ ప్రసాద్‌తో కలిసి పర్యటించారు. బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్న విద్యాసంస్థలు.. దివ్యాంగుల కోసం ర్యాంపులు, లిఫ్ట్ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే వరకు తరగతులు నిర్వహించరాదన్న కమిషన్ సభ్యులు.. ఫీజులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం మే 7వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఉత్తర్వులను ఉల్లంఘించే విద్యాసంస్థలపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details