కరోనా నియంత్రణకు అధికారులు శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికారి హరిహరరావు, ఎంపీడీవో బంధాల వెంకటేష్ పర్యవేక్షణలో చర్యలు చేపట్టారు. పొరుగు రాష్ట్రం నుంచి ఏపీలోకి ప్రవేశించే ప్రతి వాహనంలోనూ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి పొరబాటున కూడా వైరస్ మన దగ్గరకు రావొద్దన్న చర్యలో భాగంగానే ఈ పని చేస్తున్నట్టు చెప్పారు.
ఏపీకి వచ్చే ప్రతి వాహనంలోనూ రసాయన పిచికారీ - పురుషోత్తపురంలో లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే వాహనాల కారణంగా.. కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద, వాహనాల్లోనూ హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.

పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాలలో రసాయన పిచికారి