కంచిలి జాతీయ రహదారిపై కెమికల్ లారీ బోల్తా - శ్రీకాకుళం జిల్లా వార్తలు
శ్రీకాకుళం జిల్లా కంచిలి జాతీయ రహదారిపై కెమికల్ లారీ బోల్తా పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

రహదారిపై బోల్తా పడిన కెమికల్ లారీ
శ్రీకాకుళం జిల్లా కంచిలి జాతీయ రహదారిపై కెమికల్ లారీ బోల్తా పడింది. అందులోని ఫార్మాలిన్ డీఐడీ కెమికల్ కారిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కంచిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని సోంపేట ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ వారికి సమాచారం అందించారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు చేపట్టారు.